News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

నెల్లూరులో 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు DMHO 15 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ), DMLT, BSc MLT, LLB, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి వరకు ఆఫ్‌‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in

News February 17, 2026

పుంగనూరు: బైక్‌ను ఢీకొని చెరువులో దూసుకెళ్లిన ఆటో

image

పుంగనూరు మండలం గడ్డురుచెరువు వద్ద పుంగనూరు వైపు వెళ్తున్న బైక్‌ని గొల్లపల్లి వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో గొర్రెల వాలెప్ప, ప్రమీల, ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. కాగా బైకును ఢీకొన్న ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 17, 2026

జాతీయ స్థాయిలో మెరిసిన కుబీర్‌ కుర్రోడు

image

నిన్న విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో దార్ కుబీర్‌కు చెందిన తోకల చంద్రకాంత్ 99.46% పర్సంటైల్ సాధించాడు. ఇతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రైతు కుటుంబంలో పుట్టి ఉత్తమ మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు చంద్రకాంత్‌ను అభినందిస్తున్నారు. చంద్రకాంత్‌ చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉన్నాడని తండ్రి తోకల మారుతి తెలిపారు.