News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని పోలింగ్ కేంద్రం వద్ద చూపాలని, అర్హులైన వారంతా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.
News February 10, 2026
SRPT: మున్సిపల్ ఎన్నికల బందోబస్తు కట్టుదిట్టం

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో అధికారులను నియమించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. 446 పీఓలు, 446 ఏపీఓలు, 1340 ఓపీఓలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులను నియమించినట్లు వివరించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 10 SSTలు, 15 FSTలు, 7 వీవీటీలు, 7 ఎటీ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
News February 10, 2026
పార్వతీపురం: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 300 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 300 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈవో నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 10,026 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా.. 300 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.


