News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 19, 2026

అణు ఆస్తుల రక్షణకు ఇరాన్ ‘మాస్టర్ ప్లాన్’!

image

అమెరికా మిలిటరీ ప్రెజర్ పెరగడంతో ఇరాన్ తన అణు కేంద్రాలను భూగర్భ కోటల్లా మార్చేస్తోంది. పర్చిన్‌లోని ‘తలేఘన్-2’ కేంద్రాన్ని కాంక్రీట్ షెల్స్, మట్టితో కప్పేసి కనిపించకుండా బంకర్‌లా మారుస్తున్నట్లు శాటిలైట్ ఫొటోల ద్వారా తెలుస్తోంది. నతాంజ్, ఇస్ఫాహన్ ప్రాంతాల్లోని టన్నెల్ ఎంట్రన్స్‌లనూ మట్టితో పూడ్చేస్తున్నారు. ఓవైపు చర్చలు జరుగుతున్నా అటాక్ జరిగితే అణు ఆస్తులు సేఫ్‌గా ఉండేలా ఇరాన్ ప్లాన్ చేస్తోంది.

News February 19, 2026

కేయూలో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్

image

కేయూలో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 99 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 28 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీలో 55% మార్కులతో పాటు పీహెచ్‌డీ లేదా నెట్ తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50% మార్కులు సరిపోతాయి. ఎంపికలో అకడమిక్ మెరిట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 10, డెమోకు 10 మార్కులు కేటాయించారు. మార్చి మొదటి వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

News February 19, 2026

జూబ్లీహిల్స్: ఆమెకు 33.. అతడికి 23..!

image

CM ఇంటి సమీపంలో జరిగిన <<19173302>>చైన్ స్నాచింగ్ కేసు<<>>లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 33ఏళ్ల మహిళ తనకంటే 10ఏళ్లు చిన్నవాడైన 23ఏళ్ల యువకుడితో కలిసి జల్సాల కోసం చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మానస నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో బైకుపై వచ్చిన ఈ జంట ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకొని పరారైంది. ఘటన అనంతరం APకి పారిపోతున్న వీరిని రాష్ట్ర సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు.