News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

సిద్దిపేట: వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో సౌమ్యకు డాక్టరేట్

image

సిద్దిపేట పట్టణానికి చెందిన వ్యాపారవేత్త చీల లక్ష్మణ్-పద్మ దంపతుల కుమార్తె చీల సౌమ్య అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఐఏఆర్ఐ నుంచి వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని సౌమ్య ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఆమె ప్రతిభను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

News February 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

★శ్రీముఖలింగం: చక్రతీర్థస్నానాలకు పోటెత్తిన భక్తులు
★నందిగాం: వృక్షం వేర్లు ఆలయానికి రక్షణ
★వంశధార ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించాలి: ఎమ్మెల్యే బగ్గు
★పలాస: చైన్ స్నాచింగ్ చేస్తుండగా పట్టేశారు
★ఆదిత్యుని సన్నిధిలో ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ కమీషనర్
★శ్రీకాకుళం: ఈనెల 20న జాబ్ మేళా
★ఎల్.ఎన్ పేట: నదీ తీరాన ఆకట్టుకున్న ఈశ్వరుని సైకత శిల్పాలు
★ఎచ్చెర్ల: తగ్గిన టమాట ధర

News February 18, 2026

వైవీయూ మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో MOU

image

యోగి వేమన యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ బెంగళూరు మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో మధ్య మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) కుదుర్చుకున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల భవిష్యత్ ప్లేస్మెంట్ దృష్టిలో పెట్టుకొని శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్ బస్ ఇండియా సంస్థ తరఫున శేఖర్ బాబు వైవీయూ ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాస్, ప్రొ. విజయ భారతి సంతకాలు చేశారు.