News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 11, 2026

ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతంటే?

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 11, 2026

సూర్యాపేట: క్యూ లైన్‌లో నిలబడి ఓటేసిన కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పట్టణంలోని 14వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ సందర్శించారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన అనంతరం, సామాన్య ఓటరులా క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటర్ల సౌకర్యార్థం అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.

News February 11, 2026

గుండారం గుట్టల ప్రాంతంలో పెద్దపులి..?

image

కోహెడ మండలం నుంచి మల్లారం హైవే దాటి పెద్దపులి బెజ్జంకి మండలంలోని మల్లోని చెరువు గుండారం గుట్టల ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే మూడు రోజుల పాటు పశువులను ఇంటి వద్దే కట్టేసుకోవాలని, చీకటి పడే వరకు పొలాల వద్ద ఉండకూడదని హెచ్చరించారు. బెజ్జంకి పోలీసులు కూడా గ్రామస్థులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ గస్తీని పెంచారు.