News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 9, 2026
రంగారెడ్డి: జిల్లాలో తొలిరోజు 139 మందికి వ్యాక్సిన్

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 139 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 19 మంది, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 10, రాజేంద్రనగర్‌లో 30, హయత్‌నగర్‌లో 10, శంషాబాద్‌లో 20, చేవెళ్లలో 22, షాద్‌నగర్‌లో 17, మహేశ్వరంలో ఏడుగురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు.
News March 9, 2026
శ్రీవారే భక్తుడికి కలలో కనిపించిన ఘటన.!

TTDలో 1964 వరకు ఎవరన్నా స్వామి వారికి <<19334356>>ఆభరణాలు<<>> సమర్పించాలంటే నగలతోపాటు, వాటికి సమానమైన నగదు సమర్పించాల్సి ఉండేది. దీనినే ‘వర్తన’ అనేవారు. రాజులు, జమిందార్లు తరచూ విలువైన బహుమానాలు తెచ్చి స్వామి వారికి అలంకరిచాలని అధికారులపై ఒత్తిడి తెచ్చేవారంటా. దీనిని తగ్గించడానికి ఈ నిబంధన తెచ్చారు. ఈ నిబంధన ఓ సామాన్య భక్తుడి వలన రద్దయింది. స్వామివారే భక్తుడి కలలో కనిపించి ఏం చెప్పారో ఈ స్టోరీలో చూద్దాం.
News March 9, 2026
శ్రీవారే కాసుల హారం గురించి అడుగగా.!

కర్ణాటక(S) లక్కపల్లికి చెందిన నాగరాజురావు టీచర్. పేద కుటుంబం. 1964లో ఆయనకు ఓరాత్రి శ్రీవారు <<19334379>>కలలో<<>> కనిపించి కాసులు హారం సమర్పించుకుంటావా అని అడిగారట. ఆయన పెద్దగా పట్టించుకోలేదట. మరుసటిరోజు కొందరు వారి ఇంటికి తిరుపతి లడ్డూ ఇచ్చారట. దీంతో ఆయన తన కుటుంబంతో శ్రీవారు కలలో కనిపించిన విషయాన్ని వివరించారు. ఆర్థిక స్థోమత లేకపోయినా నిత్యం ఉపవాసాలు ఉంటూ స్వామిని స్మరిస్తూ 16 ఏళ్లకు 108 కాసులు హారం చేయించారు.


