News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

కోటప్పకొండలో ఆకర్షిస్తున్న దేవత మూర్తుల విగ్రహాలు

image

ప్రఖ్యాతిగాంచిన కోటప్పకొండ తిరుణాల సందర్భంగా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కొండ పరిసర ప్రాంతాలలో చెరువులు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండ ఎంట్రన్స్ ప్రారంభం నుంచి పలు ప్రాంతాలలో దేవతమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. కోటప్పకొండ సందర్శనకు వచ్చిన యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

News February 9, 2026

సంద్రాపల్లి: గుండెపోటుతో బస్టాండ్‌లో వృద్ధుడి మృతి

image

కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి గ్రామానికి చెందిన ఇత్నవేని చిన్న శంకరయ్య అనే వృద్ధుడు ఆదివారం కొడిమ్యాల బస్టాండ్ ఆవరణలో గుండెపోటుతో మృతి చెందాడు. అస్వస్థతకు గురైన అతడిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు కొడిమ్యాల బస్టాండ్‌‌కు కుటుంబీకులతో కలసి వచ్చాడు. బస్సు కోసం ఎదురు చూస్తుండగా గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు.

News February 9, 2026

చిత్తూరు: నేటి నుంచి టెన్త్ ప్రీఫైనల్స్

image

చిత్తూరు జిల్లాలో సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరగుతాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.