News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.
News February 11, 2026
జగిత్యాల: ఐదు మున్సిపాలిటీల పోలింగ్‌పై కలెక్టర్ దృష్టి

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పెల్లి, రాయికల్ మున్సిపాలిటీలలో బుధవారం జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల లోపల ఓటింగ్ సరళి, బయట ఓటర్ల రద్దీని ఆయన గమనించారు.
News February 11, 2026
WGL: ‘పుర’ పోరు.. @ 9AM పోలింగ్ శాతం

జనగామ 10.59 %
భూపాలపల్లి 12.0%
తొర్రూరు 8.77%
స్టేషన్ ఘన్పూర్ 11.53%
ములుగు 10.19%
వర్ధన్నపేట 13.02%
నర్సంపేట 12.29%
మహబూబాబాద్ 10.58 %
డోర్నకల్ 13.11%
పరకాల 9.20%
కేసముద్రం 13.36%
మరిపెడ 16.32%


