News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

12న ఏనుమాముల మార్కెట్‌కు సెలవు

image

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో ఈ నెల 12న ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. మార్కెట్‌లోని గుమస్తాలు, దాడువాయిలు సమ్మెకు మద్దతుగా విధులను బహిష్కరిస్తున్నట్లు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని, కావున రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు.

News February 10, 2026

మా ఇంధనం ఇండియా కొనకుండా US అడ్డుకుంటోంది: రష్యా

image

ఇండియా, ఇతర భాగస్వాములు తమ చౌకైన ఇంధనం కొనకుండా నిషేధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. అధిక ధరలకు US LNGని కొనాలని బలవంతం చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతిపాదనను తాము అంగీకరించామని, కానీ కొత్త ఆంక్షలు విధించారని విమర్శించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా మార్గాలను నియంత్రించడమే ఆ దేశ లక్ష్యమని ఫైరయ్యారు.

News February 10, 2026

మెదక్: ‘తెరవెనుక రాజకీయం’ ఫలితాలను మారుస్తుందా..?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో రాజకీయం తెరవెనుకకు మళ్లింది. అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను ఆకర్షించేందుకు శక్తియుక్తులను వాడుతున్నారు. తమ ప్రత్యర్థుల ఓటు బ్యాంకుకు కన్నం వేసి ఆ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు ఓటరు తీర్పును ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈనెల 13న తేలనుంది.