News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 11, 2026

జగిత్యాల: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పరిధిలో ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎస్పీ వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, భద్రతను పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News February 11, 2026

నటుడి ఆవేదన.. సాయానికి ముందుకొస్తున్న సెలబ్రిటీలు

image

₹9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ <<19103948>>జైలులో సరెండరైన<<>> విషయం తెలిసిందే. ఆదుకునేందుకు ఎవరూ రాలేదంటూ వాపోయిన ఆయన కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. రాజ్‌పాల్‌కు తన చిత్రంలో అవకాశం ఇస్తానని సోనూ సూద్ తెలిపారు. తాను ₹1.1 కోట్లు ఇస్తానని GemTunes Music ఓనర్ రావ్ ఇంద్రిజిత్ సింగ్ ప్రకటించారు. నటుడు గుర్మీత్, పొలిటీషియన్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సాయం చేస్తామని అన్నారు.

News February 11, 2026

అసెంబ్లీ బయట జగన్‌తో కలిసి పెద్దిరెడ్డి నిరసన

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ముందుగా జగన్‌తో కలిసి అసెంబ్లీ బయట పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లిన రామచంద్రారెడ్డి కాసేపటికే వాకౌట్ చేసి వచ్చేశారు.