News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

Lupus: ఈ సమస్య ఆడవారిలోనే ఎక్కువ

image

లూపస్‌ వ్యాధి బాధితుల్లో 90% మంది మహిళలే. సంతానోత్పత్తి సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ హార్మోన్లు చురుకుగా ఉండటమే దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. దీన్ని నిర్ధారించడానికి న్యూక్లియర్‌ యాంటీబాడీ, డబుల్‌స్ట్రాండ్‌ DNA, రక్తంలో C3, C4 ప్రొటీన్లు.. యాంటీఫాస్ఫోలిపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. క్రమంతప్పకుండా మందులు వాడితే ఏ ప్రమాదం ఉండదు.

News February 18, 2026

ఎటపాక: రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫ్రెండ్‌‌పై హత్యాయత్నం

image

స్నేహితుడికి రూ.కోటి విలువైన ఇన్సూరెన్స్ చేపించి.. తిరిగి అతడ్ని చంపి డబ్బు కాజేయాలని చూశాడో ప్రబుద్దుడు. వివరాలు ఇలా.. ఎటపాక(M) గన్నవరానికి చెందిన యశ్వంత్ ప్రైవేట్ ఉద్యోగి. అతని స్నేహితుడు దీపక్ యశ్వంత్‌తో రూ.కోటి విలువైన బీమా కట్టించాడు. సోదరుడిని అంటూ నామినీగా తన పేరు పెట్టాడు. యశ్వంత్‌పై మరో వ్యక్తితో కలిసి దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. పోలీసు విచారణలో బాగోతం బయటపడింది.

News February 18, 2026

హాట్ టాపిక్‌గా మారిన MLA గళ్లా మాధవి ర్యాంక్

image

TDPలో గుంటూరు వెస్ట్ MLA గళ్లా మాధవి ర్యాంక్ హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి క్షమాపణలు చెప్పాలంటూ చేపట్టిన ఆందోళన ఘటనలో మాధవి హైలెట్‌గా నిలిచారు. అయితే MLAల పనితీరుపై తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌లో మాధవికి B గ్రేడ్ రావడంతో క్యాడర్ నిరుత్సాహపడినట్లు చర్చ సాగుతోంది. దీంతో మాధవి ఫైర్ బ్రాండ్ అంటూ మురిసిపోయిన TDP నేతలు ఇప్పుడేమంటారని YCP నేతలు ఎద్దేవా చేస్తున్నారు.