News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

పామర్రు-విజయవాడ హైవేపై ప్రమాదం.. దుర్మరణం

image

పామర్రు-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగంతో వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. హైవేలపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News February 13, 2026

BIG BREAKING: మెదక్‌లో హంగ్

image

మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. 32వ వార్డు ఏకగ్రీవం అవగా మిగతా వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు అనంతరం బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ ఒక స్థానం సాధించాయి. 32 వార్డులు ఉండడంతో ఛైర్మన్ ఎన్నిక కోసం మ్యాజిక్ ఫిగర్ 17 కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్మన్ ఎవరు అవుతారన్న ఉత్కంఠ నెలకొంది.

News February 13, 2026

కల్తీపాల వ్యవహారంలో కుప్పం వాసులు.!

image

కుప్పం, పలమనేరు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కల్తీ పాల తయారీ గుట్టురట్టైంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించిన పోలీసులు, మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలకు చెందిన నలుగురు ఈ వ్యవహారంలో ఉన్నట్లు గుర్తించారు. వీరు పాలను కర్ణాటకలో విక్రయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.