News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
జగిత్యాల MLAపై ముప్పేటదాడి.. అయినా ధైర్యంగా ముందుకు..!

JGTL MLA సంజయ్‌పై వివిధ పార్టీల నేతలు రోజూ ముప్పేటదాడికి దిగారు. అయినా చలించకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. పార్టీ మారావంటూ, ఎందులో ఉన్నావో చెప్పాలంటూ BRS ఎద్దేవ చేసినా, ఆ పార్టీ MLAలు మా సంసారంలో వేలెందుకు పెడతావన్నా, కాంగ్రెస్ నేతలు అవమానించినా వేరవలేదు. చివరకు కాంగ్రెస్ కౌన్సిలర్ల తరఫున MLA ప్రచారం చేసి తన వర్గాన్ని గెలిపించుకొని మున్సిపల్ ఛైర్మన్ చేసి ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చారు.
News February 17, 2026
నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
News February 17, 2026
JGTL: పొమ్మనలేకే పొగనా..? పార్టీ మారుతారా..?

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్‌కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్‌కే పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.


