News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

T20 WC: సూపర్-8లో భారత్‌కు టఫ్ ఛాలెంజ్!

image

T20 WCలో టీమ్‌ఇండియా సూపర్-8లో తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. భారత్‌తో పాటు ఇప్పటికే S-8కి అర్హత సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపు(G1)లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా వస్తే ఈ గ్రూప్ టఫ్‌గా మారనుంది. భారత్ FEB 22న SA, 26న AUS లేదా ZIM, మార్చి 1న WIను ఢీకొట్టొచ్చు. అటు గ్రూపు-2లో SL, PAK, NZ, ENG జట్లు తలపడే అవకాశముంది.

News February 16, 2026

ఆసిఫాబాద్ చైర్మెన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు షాక్

image

ASF మున్సిపల్ ఛైర్మెన్ పీఠం కోసం కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, స్వతంత్రులు తమకు మద్దతు ఇస్తారని భావించింది. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో కాంగ్రెస్ ఛైర్మెన్ అభ్యర్థి శ్రమ వృథా అయిందని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

News February 16, 2026

మెదక్: 4 ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టారు.