News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

GNT: అంబటికి రిలీఫ్.. కోర్టు కీలక ఆదేశాలు

image

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గుంటూరు కోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం, మంచం, కూలర్, వైద్య సాయం కోరుతూ అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన మాజీ మంత్రి కావడంతో ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి, నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

News February 17, 2026

కడప: ఇవాళ సూర్యగ్రహణం.. అర్చకులు ఏమన్నారంటే?

image

ఇవాళ అమావాస్య సందర్భంగా సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని, అందువల్ల ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మీ సత్యనారాయణ స్వామి, ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ బట్టర్ తెలిపారు. గర్భిణులను గ్రహణం పేరుతో ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. యూట్యూబ్‌లో వస్తున్న గ్రహణ వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News February 17, 2026

‘ఫర్టిగేషన్’లో ఎలాంటి ఎరువులను అందించే అవకాశం ఉంటుంది?

image

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.