News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
MBNR: 41 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు!

మహబూబ్ నగర్ జిల్లాలోని 81 డివిజన్ల మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు 41 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కోసం 30, దేవరకద్రకు 6, భూత్పూర్ మున్సిపాలిటీకి 5 టేబుళ్లను కేటాయించారు. మొత్తం 185 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.
News February 13, 2026
HYDలో ఎయిర్ క్వాలిటీ @194

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున టీచర్స్ కాలనీలో 194గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 13, 2026
ఎవరీ కందుల జాహ్నవి?

సియాటెల్ యంత్రాంగం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించడంతో <<19125504>>కందుల జాహ్నవి<<>> మరోసారి వార్తల్లో నిలిచారు. 2023లో అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని మృతిచెందిన జాహ్నవిది కర్నూలు(D) కౌతాళం మం. కుంభళనూరు క్యాంప్ గ్రామం. శ్రీకాంత్, విజయలక్ష్మిల కుమార్తె జాహ్నవి ఆదోనిలో డిగ్రీ వరకు చదివారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పోలీసు వాహనం ఢీకొని మృతిచెందారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు 3ఏళ్లు న్యాయపోరాటం సాగించి గెలిచారు.


