News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
నగరంలో 291 మంది పోలీసులకు రివార్డులు

నగరంలోని గత నెలలో వివిధ కేసుల్లోని ప్రతిభ చూపించిన 291 పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబత్ర బాగ్చి రివార్డులు అందజేశారు. వివిధ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకు మెరిట్ ఆధారంగా గుర్తించి రివార్డులు క్రైమ్ మీటింగ్లో అందించారు. మిగతా సిబ్బంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మరింత పనిచేయాలన్నారు.
News February 13, 2026
రిలయన్స్‌కు వెనిజులా ఆయిల్.. లైసెన్స్ ఇచ్చిన అమెరికా!

వెనిజులా నుంచి డైరెక్ట్ ఆయిల్ కొనేందుకు రిలయన్స్‌కు US లైసెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆ కంపెనీ ఇకపై అక్కడి నుంచి నేరుగా క్రూడాయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న రిలయన్స్‌కు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీని US శాసిస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గనున్నాయి.
News February 13, 2026
మేడ్చల్: 3 రంగుల జెండాను నిలబెట్టిన ముగ్గురు ‘లత’లు!

మూడు చింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉద్దమర్రి వార్డులకు చెందిన రాజీగళ్ల లత, పెద్దిరెడ్డి లత, దోసకాయల లత కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకే పేరుతో బరిలోకి దిగిన ఈ ముగ్గురు హస్తం గుర్తు మీద విజయం సాధించారు. ఎంసీపల్లిలో కారు స్పీడ్‌కు ఈ ముగ్గురు బ్రేకులేయడం చర్చనీయాంశమైంది. ఒకే పేరుతో ముగ్గురు కౌన్సిలర్లు కొలువుదీరడం గ్రామంలోనే కాదు మున్సిపాలిటీ అంతటా ఆసక్తిగా మారింది.


