News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన జిల్లా జగిత్యాల

ఉద్యమం అనగానే గుర్తుకొచ్చే జిల్లా జగిత్యాల. జగిత్యాల జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన ఈ జిల్లా 2016లో ఉమ్మడి కరీంనగర్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఏర్పడింది. 17వ శతాబ్దంలో జగదేవుడు పాలించిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఆయన పేరుతో జగిత్యాలగా పిలుస్తారు. వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల.. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి. జిల్లాలో వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా, మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువగా సాగు అవుతున్నాయి.
News February 18, 2026
మ్యూల్ అకౌంట్స్ పై విచారణ.. యువకుడి సూసైడ్!

విజయవాడలో పెద్దఎత్తున మ్యూల్ అకౌంట్స్ తెరిచి సైబర్ నేరలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు పలు బ్యాంకుల్లో పని చేసే మేనేజర్లు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో NTR సర్కిల్‌లోని ఇండియన్ బ్యాంకులో ఒప్పంద ఉద్యోగి ఆవుల సాయి భవాని(32)ని గత వారం విచారించారు. మనస్తాపం చెందిన యువకుడు ఈ నెల 16న తాడేపల్లి పరిధిలో బకింగ్‌హామ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 18, 2026
బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

కల్లూరు మండలం బస్తిపాడులోని గ్రామ సచివాలయంలో కలెక్టర్ ఏ.సిరి మండల సమాఖ్య పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలతో ఆమె మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి, వాటిని ఆపాలన్నారు. చదువురాని వారు అక్షరాంధ్రలో ఎన్‌రోల్‌మెంట్ అవ్వాలని, చదువు వస్తే గౌరవం వస్తుందని తెలిపారు.


