News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

మంత్రి లోకేశ్‌వి అంతా PR స్టంటే: YCP

image

మదనపల్లెలో జరిగిన బాలిక ఘటనపై ప్రభుత్వాన్ని వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. మంత్రి నారా లోకేశ్‌వి అంతా PR స్టంటే అంటూ ట్వీట్ చేసింది. ‘బాలిక ఉదయం 4:30కి మిస్సై అయింది. 8:30కి బాలిక హత్యకు గురైంది. ఈ కేసు గురించి తెలుసుకోకుండా ఆ బాలికను కనుగొనమని 8.53కి హోం మంత్రికి లోకేశ్ ట్వీట్ చేశారు. అప్పటికే బాలిక చనిపోయింది. ఇది PR స్టంట్. లోకేశ్‌ది సిగ్గులేని రాజకీయాలు’ అంటూ మండిపడింది.

News February 17, 2026

అసెంబ్లీలో మూగబోయిన మైకులు

image

AP: అసెంబ్లీ మైకుల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు సభల్లో గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. ఉదయం యథావిధిగా 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగా, సభ్యుల స్థానాల్లోని మైకులు పనిచేయలేదు. స్పీకర్ గంటపాటు సభను వాయిదా వేశారు. తర్వాత సమస్యను టెక్నీషియన్లు పరిష్కరించగా ఉ.11:30 గంటల నుంచి సభ తిరిగి ప్రారంభమైంది. శాసన మండలి కూడా ఉ.11 గంటలకు ప్రారంభమైంది. సమస్య తలెత్తడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 17, 2026

KMR: షబ్బీర్ అలీకి నా గురించి మాట్లాడే అర్హత లేదు: ఎమ్మెల్యే

image

కామారెడ్డి కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షబ్బీర్ అలీ గతంలో హైదరాబాద్‌లోని ఉగ్రవాదుల ఇంటికి వెళ్లిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. షబ్బీర్ అలీ గతంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ వద్ద ఎంత వసూలు చేశాడో తాను నిరూపిస్తానన్నారు.