News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

పాలమూరు: సీఎం కప్‌ పోటీలకు సీఎంకు ఆహ్వానం

image

గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 20న ప్రారంభంకానున్న సీఎం కప్‌-2026 కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్ శివాసేనరెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ MD సోనిబాలాదేవిలు ఆహ్వానించారు. మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్‌లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని, పాఠశాల నుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి కోరారు.

News February 17, 2026

సర్టిఫికెట్ల పరిశీలనకు DEOకు లేఖ: CDPO

image

అంగన్వాడీ ఉద్యోగాలకు అభ్యర్థులు సమర్పించిన టెన్త్ సర్టిఫికెట్లను పరిశీలించాలంటూ DEOకు లేఖ రాసినట్లు కుప్పం CDPO చంద్రకళ తెలిపారు. అయితే, కలెక్టర్ ద్వారా ఆదేశాలు రావాలని DEO చెప్పడంతో కడ PD ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్టిఫికెట్లు ఒరిజినల్ Or ఫేక్ అన్నది విద్యాశాఖ అధికారుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. కుప్పంలో 10th ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని వారిని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.

News February 17, 2026

హీరో తండ్రి కన్నుమూత

image

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న మరణించగా తాజాగా ఆ వార్త బయటకు వచ్చింది. ఢిల్లీలో కుటుంబసభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సిద్ధార్థ్, ఆయన భార్య కియారా అద్వాణీ హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా పని చేశారు.