News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
ఖమ్మం: 20 ఏళ్ల తర్వాత ఇంటికి చేర్చిన ‘రోడ్డు ప్రమాదం’

తిరుమలాయపాలెం మండలం రాజారానికి చెందిన మందుల లాలు 20 ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఒక రోడ్డు ప్రమాదం ఆయనను కుటుంబంతో కలిపింది. విజయవాడలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలైన లాలు ఆసుపత్రిలో చేరగా, పోలీసులు ఆయన వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడి, ఆయన క్షేమంగా సొంతింటికి చేరుకున్నారు. ఈ వింత సంఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
News February 16, 2026
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

రేపు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
News February 16, 2026
మక్తల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మానస, వైస్ ఛైర్‌పర్సన్‌గా శైవిరెడ్డి

మక్తల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వాకిటి మానస, వైస్ ఛైర్‌పర్సన్‌గా శైవిరెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ప్రకటించారు. మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని పూర్తి మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. దీంతో మక్తల్ మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి.


