News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

<>HLL <<>>లైఫ్‌కేర్ లిమిటెడ్ 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు నేటి నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, బీఫార్మసీ, MBA, MSW, PGDBM, MIB, MPIB, PGDPM, MA, MHRM, BSc ఉత్తీర్ణులు అర్హులు. నెలకు రూ.40K-రూ.1.40L చెల్లిస్తారు. CBT, పర్సనల్ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, DV, ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్:www.lifecarehll.com

News February 18, 2026

క‌ష్ణా: మూగబోయిన నాడు-నేడు ప్యూరిఫైర్లు

image

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు శుద్ధ తాగునీటిని అందించేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన నాడు-నేడు పథకంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాలు జిల్లా వ్యాప్తంగా ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. గతంలో ఈ యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఐనా మరమ్మతులు చేపట్టలేదని, వేసవికి మునుపే మరమ్మతులు చేసి పిల్లలకు తాగునీరు అందించాలని పేరెంట్స్ కోరుతున్నారు.

News February 18, 2026

వరంగల్: త్రి శక్తి పీఠం గుడి సాక్షిగా కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గ బేధాలు!

image

వరంగల్ గోపాల స్వామి గుడి సమీపంలోని త్రి శక్తీ పీఠం దేవాలయం కూల్చివేతను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్‌లో వర్గ బేధాలు బయట పడ్డాయి. MLC బసవరాజు సారయ్య వర్గం నేతలంతా నిరసనలో పాల్గొనగా, కొండా వర్గం నేతలు నిరసన తెలుపుతున్న సారయ్య వర్గం వద్దకు వచ్చిన దేవాలయం కూల్చివేతను సమర్థిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికార కాంగ్రెస్‌లో వెలుగు చూసిన వర్గ భేదాలపై చర్చ మొదలైంది.