News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
2029లో రాహుల్ PM.. తొలుత చేసే పని ఇదే: మాణికం ఠాగూర్

2029లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ PM అవుతారని ఆ పార్టీ MP మాణికం ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఆయన అధికారంలోకి రాగానే పాలనలో పాతుకుపోయిన ‘సీక్రెసీ కల్చర్’ను రూపుమాపేలా గైడ్‌లైన్స్ తీసుకొస్తారని చెప్పారు. దేశ ప్రయోజనాలు, ఆర్మీ గౌరవాన్ని కాపాడడం ముఖ్యమే అయినప్పటికీ.. పాలనలో పారదర్శకత కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కని వ్యాఖ్యానించారు.
News February 13, 2026
GWL: ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధించినట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ర్యాలీలు, శోభాయాత్రలు చేయరాదన్నారు. జిల్లాలో ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలన్నారు.
News February 13, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<


