News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
ఘనంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను జరిపారు.
News February 16, 2026
ఎన్నికల కోడ్ ఉపసంహరణ: ADB కలెక్టర్

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిను తక్షణమే ఉపసంహరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసినందున మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలు ఇకపై వర్తించవని స్పష్టం చేశారు.
News February 16, 2026
ఖమ్మం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

ప్రేమించి మోసం చేశారంటూ ఓ యువతి ఇంటి ముందు బైఠాయించిన ఘటన కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామంలో జరిగింది. బూర్గంపాడు మండలానికి చెందిన ఓ యువతి ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల మనోజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నిరాకరించడంతో యువతి, కుటుంబ సభ్యులు మనోజ్ ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


