News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
చిట్యాలను ఏలిన వారు వీరే..!

కాకతీయుల కాలంలో గంగయ్య సాహిణి పునాది వేసిన నాటి చిట్టలపురం, నేటి చిట్యాల ఘనమైన రాజకీయ చరిత్రను కలిగి ఉంది. 1958లో పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి యిమ్మడి నర్సయ్య (11 ఏళ్లు), పందిరి లక్ష్మయ్య (21 ఏళ్లు) సుదీర్ఘకాలం పాలించి గ్రామ గతిని మార్చారు. అనంతరం ఇమ్మడి కృష్ణమూర్తి, వేలుపల్లి భిక్షపతి (2000 వరకు సర్పంచులుగా ఉన్నవారు), ఆదిమల్లయ్య, జిట్ట నగేశ్, శ్రీలక్ష్మి సర్పంచ్‌లుగా సేవలు అందించారు.
News February 10, 2026
బాల్య వివాహ రహిత జిల్లాగా అనంతపురం: కలెక్టర్

అనంతపురాన్ని బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘బాల్య వివాహ విముక్త భారత్’ ప్రచార రథాన్ని ప్రారంభించి, గోడపత్రికను ఆవిష్కరించారు. వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 3 నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
News February 10, 2026
కొడంగల్‌లో సీఎం ఓటేయడానికి వస్తారా?

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరిగే పోలింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు సమాచారం. సీఎం బుధవారం కొడంగల్‌కు రానున్నట్లు తెలిసింది. సీఎం సొంత నియోజకవర్గం హెడ్ క్వాటర్ కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉ.7 నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది.


