News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
ఆకివీడులో ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

ఆకివీడు 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేశారు. నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ హైమావతి, వైసీపీ కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, నాయకులు రుంకాని శ్రీహరిలు ఫిర్యాదు చేశారు. తన వార్డు పరిధిలో కూటమి నాయకులు సీసీ రోడ్డు ప్రారంభంలో ప్రొటోకాల్ ఉల్లంఘించారని, చర్యలు తీసుకోవాలని హైమావతి కలెక్టర్‌ను కోరారు.
News February 13, 2026
‘లోకల్’ ఫలితాలపై ‘గులాబీ’లో అంతర్మథనం

TG: మున్సి‘పోల్స్’ పై BRSలో అంతర్మథనం మొదలైంది. KTR, హరీశ్ మినహా పార్టీ MLAలు, నేతలు పోరాడిన స్థానాల్లో ఫలితం దక్కలేదు. గజ్వేల్, సిరిసిల్ల, దుబ్బాకలో గెలవగా మిగతా చోట్ల హంగ్, లేదా 2వ స్థానంలో నిలిచింది. జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సహా ఉమ్మడి నల్గొండలో విఫలమైంది. దయాకర్ రావు జిల్లా WGLలోనూ అంతే. హుజూరాబాద్, జమ్మికుంటలో కౌశిక్ దెబ్బతిన్నారు. HYD శివారులో పట్టు నిలుపుకొంది.
News February 13, 2026
గద్వాల మున్సిపల్ పీఠం కోసం హోరాహోరీ… పొత్తులపై ఉత్కంఠ

గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ 16,బీఆర్ఎస్ 11,బీజేపీ7 స్థానాలు సాధించాయి. ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ ఇండిపెండెంట్ల మద్దతుపై ఆశలు పెట్టుకోగా, BRS–BJP అభ్యర్థిపై చర్చలు జరుగుతున్నాయి. ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరితే ఛైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 16న జరగనున్న ఛైర్మన్ ఎన్నికతో తెర పడనుంది.


