News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

రేపు విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

image

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO మాణిక్యం నాయుడు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని అన్నారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.

News February 13, 2026

గద్వాల్: రోకలిబండతో భర్తను చంపిన భార్య

image

వడ్డేపల్లి మండలం జులేకల్‌లో గురువారం రాత్రి ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్త కురువ వెంకటరాములు (53)ను భార్య సరోజమ్మ రోకలిబండతో మోది హత్య చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. అప్పుల బాధలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. అప్పుల వారు తరచూ ఇంటికి వచ్చి వేధిస్తున్నా, భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన సరోజమ్మ ఈ దారుణానికి ఒడిగట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2026

జెన్ జీ లవ్ స్టోరీల్లో ‘ఆరెంజ్’ ఫ్లేవర్!

image

నేటి సోషల్ మీడియా యుగంలో ప్రేమలు ‘ఇన్‌స్టంట్’ అయిపోయాయి. జెన్ జీల పోకడతో బంధాలు కలకాలం ఉండటం కలగా మారుతోంది. ప్రతి వాలంటైన్స్ డేకి ఓ కొత్త జంట పుట్టుకొస్తోంది. కానీ ఆ ప్రేమ మొక్కగా ఎదిగేలోపే మనస్పర్ధల తుఫానుకు రాలిపోతోంది. ‘ప్రేమ అంటే కొన్నాళ్లే బాగుంటుంది’ అనే ‘ఆరెంజ్’ సినిమా సిద్ధాంతాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఈ ‘షార్ట్ టర్మ్’ రిలేషన్‌షిప్ వల్ల పాతకాలపు శాశ్వత అనుబంధాలు కనుమరుగవుతున్నాయి.