News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
చిత్తూరు: 2.25 లక్షల రుద్రాక్షలతో మహా శివలింగం ఎక్కడో తెలుసా..

గుడిపల్లి (M) మల్లప్ప కొండపై నెలకొని ఉండు శ్రీ మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా మల్లప్ప కొండపై 2.25 లక్షల రుద్రాక్షలతో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ నరసింహ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ నరసింహ కోరారు. ఈనెల 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 13, 2026
తిరుపతి: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు సత్యవేడు నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు APSRTC సత్యవేడు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 14వ తేదీ సదాశివకోనకు 3 ప్రత్యేక బస్సులు, అవంతికోనకు 1 బస్సు నడపనున్నట్లు తెలిపారు. 15వ తేదీ 10 ప్రత్యేక బస్సులు సదాశివకోనకు, అవంతి కోనకు 3 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు.


