News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కీలక నిర్ణయం

image

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చేసినట్లు SP రాజేశ్ చంద్ర ప్రకటించారు. సమాచార భద్రతను పటిష్ఠం చేయడంలో భాగంగా ఇప్పటి వరకు వాడుకలో ఉన్న జీమెయిల్ ఐడీలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వీటికి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారి సురక్షితమైన @tspolice.gov.in ఈమెయిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

News February 18, 2026

జిల్లాలో 52వేల మందికి టీబీ పరీక్షలు: DMHO వెంకటరమణ

image

జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 52,000 మందికి టీబీ పరీక్షలు చేయగా, 765 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

అశ్వ వాహనంపై ఆదిదంపతులు

image

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజున శివపార్వతులు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రికి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా ముగియనున్నాయి.