News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
BREAKING: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 18 వార్డులకు గాను 13 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 5 వార్డులు BRS గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
BREAKING: రామాయంపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

రామాయంపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
గద్వాల: మున్సిపల్ పోరులో ‘హంగ్’.. ఛైర్మన్ పీఠం ఎవరికి?

గద్వాల మున్సిపాలిటీలో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మొత్తం 37 వార్డుల్లో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12, బీజేపీ 7, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. మేజిక్ ఫిగర్ 19 కాగా, అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ మరో నలుగురి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అయితే, వ్యూహాత్మకంగా బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపితే (12+7=19) సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.


