News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 15, 2026

అనకాపల్లి: రేపటి నుంచి రైతన్న-మీ కోసం

image

జిల్లాలో ఈనెల 16 నుంచి రైతన్న-మీకోసం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ సహకారం ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు రాబోయే ఎల్‌నినోపై సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

News March 15, 2026

అలర్ట్..డొంకరాయి జలాశయం నుంచి 3,700 క్యూసెక్కుల నీరు విడుదల

image

ఇరిగేషన్ అధికారుల ఆదేశాలతో డొంకరాయి జలాశయం నుంచి ఆదివారం 3 గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ రాజారావు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలకు రబీ సీజన్ అవసరాలకు 8,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా డొంకరాయి జలాశయం గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కులు, జలవిద్యుత్ ఉత్పత్తి అనంతరం 4,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 15, 2026

అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దు- కలెక్టర్

image

గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.