News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

గద్వాల: ముగిసిన ఉత్కంఠ.. మున్సిపల్ సారథులు వీరే!

image

గద్వాల మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ వీడింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన వర్గానికే పీఠం దక్కేలా వ్యూహం ఫలించింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా తుమ్మల జయలక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా శంకర్‌ పేర్లను ఎమ్మెల్యే అధికారికంగా ఖరారు చేశారు. దీంతో గద్వాల గడ్డపై ఎమ్మెల్యే మరోసారి తన పట్టు నిరూపించుకున్నారు.

News February 16, 2026

నేడే ఎన్నిక.. సంగారెడ్డి ఎస్పీ హెచ్చరిక

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపల్ కార్యాలయాల వద్ద నేడు ఆంక్షలు విధించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు కార్డులున్న కౌన్సిలర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. ఇతరులు కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News February 16, 2026

చిత్తూరు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

కార్వేటినగరం M) తురక మిట్ట వద్ద సోమవారం కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న దేవకి అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, క్షతగాత్రులను CHC ఆసుపత్రికి తరలించారు. సదాశివకోనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.