News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
పాలమూరు: కాంగ్రెస్ ఖాతాలోకి 17 ఛైర్మన్, 1 మేయర్

ఉమ్మడి పాలమూరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/ మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (INC) 17 ఛైర్మన్, 1 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 2 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFB(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)లకు చెరొకటి ఛైర్మన్ స్థానాలు దక్కాయి.
News February 17, 2026
₹34,855 కోట్లు.. సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బు ఇది!

దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆన్‌లైన్ ఫ్రాడ్‌తో నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ₹34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. అందులో ₹12,230 కోట్లను అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైబర్ నేరాలపై నమోదైన 234 కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్, క్రిప్టో కరెన్సీ, లోన్ యాప్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్టులతో దోచుకుంటున్నట్లు వెల్లడించారు.
News February 17, 2026
కృష్ణా వర్సిటీపై కనికరం లేదా..?

KRUలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం ఉద్యోగుల జీతభత్యాలకు రూ.10.5 కోట్లు కేటాయించారు. గతంలో రూ.10 కోట్లతో ఇంజినీరింగ్ బిల్డింగ్, బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి ఫౌండేషన్ వేశారు. కానీ నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. హాస్టల్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు అద్దె, రవాణా ఖర్చు శాపంగా మారింది. ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.


