News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
పాఠశాలల్లో పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలోపు గ్రౌండ్ లెవలింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సీపీవో రవీందర్, డీసీహెచ్‌వో శ్రీధర్, పీఎం షేక్ పాల్గొన్నారు.
News February 17, 2026
జహీరాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా యూనుస్

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ యూనుస్ ఛైర్మన్‌గా, 16వ వార్డు కౌన్సిలర్ కొత్తకాపు శిరీష రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఐఎం, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్‌కు మెజారిటీ లభించింది. ఆర్డీవో దేవుజా సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
News February 17, 2026
సల్మాన్ తండ్రి సలీమ్‌కు అస్వస్థత

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ (90) అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సహా కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు. మరో బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్‌తో కలిసి షోలే, దీవార్, జంజీర్, త్రిశూల్, డాన్ వంటి బ్లాక్‌బస్టర్లు అందించారు.


