News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
ఇంటర్ ప్రవేశాలపై భద్రాద్రి కలెక్టర్ కీలక ఆదేశాలు

భద్రాద్రి జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2026
KNR: శాతవాహన అధ్యాపకులకు అదనపు బాధ్యతలు

శాతవాహన విశ్వవిద్యాలయంలో పరిపాలన, విద్య సంబంధమైన విధుల కోసం అదనపు కోఆర్డినేటర్లను నియమించారు. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ విభాగంలో కామర్స్ అధ్యాపకుడైన డా. కంచు తిరుపతి కోఆర్డినేటర్ గా, కంప్యూటర్ సైన్స్ విభాగంలోని జి.నరసింహ చారిని స్టూడెంట్స్ ఆన్లైన్ అటెండెన్స్ కోఆర్డినేటర్ గా నియమకయ్యరు. ఈ మేరకు SU VC ఉమేష్ కుమార్ ఆదేశాలతో రిజిస్ట్రార్ ఆచార్య పి.సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 18, 2026
నరసరావుపేట: మెప్మా స్కామ్‌పై పోలీసులకు ఫిర్యాదు

నరసరావుపేట మెప్మా కార్యాలయంలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సిబ్బంది దీప, ప్రణతి, ఉమర్ వలి, భూదేవి, మల్లికార్జున కలిసి నకిలీ డ్వాక్రా గ్రూపులను సృష్టించి, వివిధ బ్యాంకుల నుంచి రూ. 9 కోట్ల మేర రుణాలు పొంది మోసం చేశారని పల్నాడు జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అఖిల బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


