News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
జగిత్యాల: ‘10వ తరగతిలో 100శాతం ఫలితాలు సాధించాలి’

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి SSC పరీక్షల సన్నద్ధతపై కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత అధ్యక్షత వహించారు. రాబోయే పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు.
News February 18, 2026
జగిత్యాల: ‘ఉదయం 9.05 తర్వాత ఎంట్రీ లేదు’

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2026 నేపథ్యంలో జగిత్యాల అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లాలో 30 థియరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిటీ కన్వీనర్ బి.నారాయణ తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు వంటి వసతులు కల్పించినట్లు చెప్పారు. ఉదయం 9.05 నిమిషాల తర్వాత అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
News February 18, 2026
శివాజీ జయంతి ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి: ADB SP

శివాజీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా జరిగే ర్యాలీలు, సభలకు ముందస్తు పోలీసుల అనుమతులు తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. 30 పోలీస్ ACT అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా బైక్ ర్యాలీలు, డీజేలు పెట్టవద్దని.. శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. ర్యాలీలలో కత్తులు, తల్వార్ల ప్రదర్శనలు, ఇతర మతాలను కించపరిచే నినాదాలు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


