News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 19, 2026
KMR: సహేరి అంటే ఏమిటి? ఇఫ్తార్ విశిష్టత ఇదే..

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు, అంటే ఫజర్ అజాన్ కంటే ముందే తీసుకునే ఆహారాన్ని ‘సహేరి’ అంటారు. రోజంతా నిష్టగా ఉపవాసం ఉండేందుకు శరీరానికి అవసరమైన శక్తిని ఈ ఆహారం అందిస్తుంది. రోజంతా నీరు కూడా ముట్టకుండా కఠిన దీక్షను పాటించిన అనంతరం, సూర్యాస్తమయం వేళ దీక్షను విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సాధారణంగా ఖర్జూరం లేదా మంచి నీటితో ఉపవాసాన్ని విరమిస్తారు.
News February 19, 2026
తాబేళ్లను మొక్కుబడిగా సమర్పించే దేవాలయం!

అస్సాంలోని హజోలో మణికూట పర్వతంపై విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో పూజలందుకుంటారు. ఇక్కడి కోనేరులో భక్తులు తాబేళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. తాబేళ్లను కూర్మావతారంగా పూజిస్తారు. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని బుద్ధుడు మోక్షం పొందిన ‘మహాముని’ క్షేత్రంగా కొలుస్తారు. క్రీ.శ.1583లో నిర్మితమైన ఆలయ శిల్పకళా సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మధు, కైటభ రాక్షసులను విష్ణుమూర్తి ఇక్కడే సంహరించారని పురాణాల వాక్కు.
News February 19, 2026
TU: ముస్లిం సిబ్బందికి గంట ముందు వెళ్లడానికి అనుమతి: రిజిస్ట్రార్

తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశానుసారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు నిర్వహించుకోవడానికి గాను, తెలంగాణ విశ్వవిద్యాలయం పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తున్నట్లు టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. ఉపకులపతి ఆచార్య యాదగిరి సూచనల మేరకు నేటి నుంచి మార్చి 20 వరకు ఒక గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


