News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కౌంటింగ్ షురూ

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఆమనగల్లు(బ్రిలియంట్ హై స్కూల్), చేవెళ్ల(ఫర్హా కాలేజ్), IBP(శ్రీఇందు కాలేజ్), మొయినాబాద్(మ్యాక్ ఫార్మసీ కాలేజీ), షాద్‌నగర్(మినీ స్టేడియం), శంకర్‌పల్లి(మున్సిపల్ ఆడిటోరియం), కొడంగల్(GOVT. కాలేజీ), పరిగి(నం.1 స్కూల్), VKB(SAP కాలేజ్), తాండూరు(St.MARKS), ఎల్లంపేట్(BBC), అలియాబాద్(మజీద్‌పూర్ శ్రీ చైతన్య కాలేజ్), MCపల్లి(జగ్గగూడ)లో కౌంటింగ్ జరుగుతోంది.

News February 13, 2026

ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.

News February 13, 2026

శివుడి మెడలో పుర్రెల దండ ఎందుకంటే

image

వర గర్వంతో విర్రవీగుతున్న రాక్షసులను అదుపు చేయడానికి మహావిష్ణువు సూచనతో శివుడు ఈ భీకర రూపాన్ని ధరించాడు. వారిని చెడు మార్గం నుంచి మళ్లించి, వారి ఆత్మతేజస్సును తగ్గించడం ద్వారా దేవతలను రక్షించాడు. ఇది కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు. ధర్మాన్ని నిలబెట్టడానికి హరిహరులు చేసిన సంయుక్త ప్రయత్నం. అలాగే, ఇది జీవితం శాశ్వతం కాదని, అంతిమంగా అంతా శూన్యమని తెలిపే వైరాగ్యానికి ప్రతీక.