News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం: DGP

image

TG: నాంపల్లి FSL అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని DGP శివధర్ రెడ్డి వెల్లడించారు. ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవమని, ఆ కేసు ఫైల్స్‌ను 2021లోనే కోర్టుకు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రిపోర్టులూ ఇచ్చామన్నారు. HYD మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ప్రచార సమయంలో ₹3.09Cr పట్టుబడినట్లు వెల్లడించారు. మక్తల్ BJP అభ్యర్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేశామన్నారు.

News February 10, 2026

అమరావతి అనుసంధానంగా నాలుగు వరుసల ROB

image

రాజధాని అమరావతి అనుసంధానంగా మంగళగిరి పట్టణంలో నిడమర్రు రైల్వే గేట్ వద్ద నాలుగు వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.90.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును18 నెలల్లో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రద్దీ తగ్గించి, అమరావతి ప్రాంతానికి వేగవంతమైన రాకపోకలకు ఇది దోహదం చేయనుంది.

News February 10, 2026

కోర్టుల్లో రాజకీయ పోరాటాలు చేయొద్దు: CJI

image

అస్సాం CM హిమంత బిశ్వ శర్మ <<19088953>>తుపాకీ వీడియో<<>> విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ వివాదాలకు కేంద్రంగా న్యాయవ్యవస్థలను మార్చొద్దని హెచ్చరించింది. కోర్టుల్లో రాజకీయ పోరాటాలు చేయొద్దని కమ్యూనిస్టు పార్టీలకు CJI జస్టిస్ సూర్యకాంత్ హితవుపలికారు. అత్యవసరంగా విచారించాలన్న పిటిషన్ల వినతిని తోసిపుచ్చారు.