News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

బిల్‌గేట్స్‌కు మంత్రులను పరిచయం చేసిన CM

image

AP: అమరావతి చేరుకున్న మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు మంత్రులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ అయ్యారు. RTGSకు వెళ్లి పరిపాలనలో సాంకేతిక వాడకాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న సేవలను ఆయనకు సీఎం వివరించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాలులో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం కానున్నారు.

News February 16, 2026

JGL: జీవన్ రెడ్డికి మొండిచేయి.. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే!

image

జగిత్యాల మున్సిపల్ పీఠం ఎన్నికలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అధిష్ఠానం మొండిచేయి చూపగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎమ్మెల్యే వర్గం నుంచి సమిండ్ల వాణి, వైస్ ఛైర్మన్‌గా జీనత్ పర్వీన్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఛైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

News February 16, 2026

కృష్ణా: హోలీకి ఊరెళ్తున్నారా?.. అయితే మీకే..!

image

హొలీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- తిరుపతి(TPTY) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08547 VSKP- TPTY రైలు మార్చి 4- 25 వరకు ప్రతి బుధవారం, నం.08548 TPTY- VSKP మధ్య నడిచే రైలు మార్చి 5- 26 వరకు ప్రతి గురువారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు మార్గమధ్యంలో విజయవాడ, గుడివాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.