News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 12, 2026
MDK: అందరి చూపు అటువైపే..

మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి చూపు రేపటి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బయటకు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నా.. సర్వేల్లో విభిన్న ఫలితాలు రావడం, పోలింగ్ తర్వాత అభ్యర్థులు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల ద్విముఖ, త్రిముఖ పోరు, బలమైన నాయకులు ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
News February 12, 2026
GNT: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా?

ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.
News February 12, 2026
ఖమ్మం: తాను చనిపోతూ.. ఐదుగురిని బతికించాడు

మధిరకు చెందిన బీటెక్ విద్యార్థి కందిమళ్ల విజయకుమార్ ఇటీవల తాడేపల్లి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. తీవ్ర విషాదంలోనూ ఆయన కుటుంబ సభ్యులు సాహసోపేత నిర్ణయం తీసుకుని అవయవదానానికి సమ్మతించారు. ఆయన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కిడ్నీలు, కార్నియా దానం చేయడంతో ఐదుగురికి ప్రాణదానం లభించింది. విద్యార్థి కుటుంబం చూపిన ఔదార్యాన్ని వైద్యులు, స్థానికులు కొనియాడారు.


