News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 12, 2026

నల్గొండ: భారత్ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

image

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు చేపట్టిన ‘భారత్ బంద్’కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. లేబర్ కోడ్‌ల రద్దు, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 12, 2026

రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రేషన్ కార్డులు లేని అర్హులైన వ్యక్తులు ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చవచ్చని తెలిపింది. గత ఏడాది కాలంలో 14.40 లక్షల కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించింది. కాగా 2026 JANకి మొత్తం కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరాయంది.

News February 12, 2026

NRPT: కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడంటే..

image

నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కోస్గి(పాలిటెక్నిక్ కాలేజీ), మద్దూరు(జూనియర్ కాలేజీ), నారాయణపేట(ఎర్రగుట్ట గురుకులం), మక్తల్‌లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు చేపట్టారు.