News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తే ఇక కఠిన చర్యలు: VZM SP

రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గడ్డి, చెరకు, ఇసుక, గ్రావెల్, సిమెంట్, తదితర సరకులతో ఓవర్‌లోడింగ్ చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఓవర్‌లోడింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

పాలమూరు: మెగా జాబ్ మేళా

మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 19న ఉ 10.30 గంటలకు జిల్లా ఎంప్లా యిమెంట్ ఎక్ఛేంజ్, పిల్లలమర్రి రోడ్డులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రిప్రియ తెలిపారు. మొత్తం 4 ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 200 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. SSC, ఇంటర్, డిగ్రీ, ITI, ఫార్మసీ అర్హతలున్న 18-30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు పాల్గొనవచ్చని ఆమె పేర్కొన్నారు.