News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

image

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.

News February 10, 2026

విలీన గ్రామాల ప్రక్రియ ఆలస్యం.. GVMC ఎన్నికలపై అనిశ్చితి

image

GVMCలో 64 పంచాయతీల విలీన ప్రతిపాదనపై పంచాయతీరాజ్ శాఖ దగ్గర ప్రక్రియ ముందుకు సాగడం లేదు. విలీనానికి ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల పరిశీలన, వార్డుల విభజన, ఓటర్ల జాబితా వంటి దశలు పూర్తికావాలి. మార్చి 17తో పాలక మండలి గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌పై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1 అర్హత ఆధారంగా వార్డుల వారిగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయాలని ఆదేశించింది.

News February 10, 2026

SRPT: మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. 141 వార్డుల్లో 2,232 మంది సిబ్బందితో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.