News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
హస్తం-గులాబీ దోస్తీ: కామారెడ్డి కౌన్సిల్‌లో సరికొత్త సమీకరణం!

కామారెడ్డి మున్సిపాలిటీలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు స్వతంత్ర కౌన్సిలర్ల ఐక్య మద్దతుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
News February 16, 2026
రామగుండం కార్పొరేషన్ మేయర్‌గా మహంకాళి స్వామి

రామగుండం కార్పొరేషన్ 4వ నగర మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా అదే పార్టీకి చెందిన పాతిపెల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జడ్పీ సీఈవో నరేందర్ అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు కార్పొరేటర్లను సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎన్నికైన కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
News February 16, 2026
NZB: BRS మద్దతుతో కాంగ్రెస్ మేయర్ ఎంపిక

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూరగాయల ఉమారాణి BRS కార్పోరేటర్ మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్, 14 సీట్లు గెలిచిన ఎంఐఎం, ఒకే సీటు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుతో ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. 28 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని వెనక్కి నెట్టేశారు.


