News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

హోలీ పండుగ స్పెషల్.. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ విడుదల

image

హోలీ పండుగ రద్దీ దృష్ట్యా భారత రైల్వే మార్చి నెలలో విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లికి మార్చి 6 నుంచి 27 వరకు (శుక్రవారాలు), బెంగళూరుకు మార్చి 1 నుంచి 29 వరకు (ఆదివారాలు), తిరుపతికి మార్చి 2 నుంచి 30 వరకు (సోమవారాలు) ఈ రైళ్లు నడుస్తాయి. అలాగే షాలిమార్, సంబల్పూర్, భువనేశ్వర్ మార్గాల్లోనూ మార్చి నెల అంతా వారపు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

News February 16, 2026

MBNR: మధ్య తరగతి కుటుంబం నుంచి మేయర్‌ దాకా!

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ అప్పన్నపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శీను ముదిరాజ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ తొలి మహిళ మేయర్‌గా మమత ఎన్నిక కావడం విశేషం. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి మేయర్‌గా ఎన్నిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 16, 2026

కృష్ణా: తండ్రికి ఆసరాగా వెళ్తూ.. అనంత లోకాలకు!

image

తండ్రికి ఆసరాగా ఉండాలనుకున్న ఆ యువకుడిని జలరూపంలో మృత్యువు కబళించింది. పోరంకికి చెందిన డిగ్రీ విద్యార్థి సత్యనారాయణ, ఆదివారం సెలవు కావడంతో తండ్రితో కలిసి కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.