News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
అమెరికాలో ప్రవాసుల వరుస మరణాలు

అమెరికాలో స్థిరపడిన వరంగల్ వాసుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం వ్యవధిలోనే నగరానికి చెందిన ముగ్గురు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 10న కొత్త శ్వేత(40), 13న చిదురాల విజయవాణి(55), తాజాగా తాడిపత్రి రాకేష్(40) మృతి చెందారు. వరుస అకాల మరణాలతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News March 16, 2026
కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల అభినందనలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్థాపించి, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పిస్తున్న కలెక్టర్ మహేష్ కుమార్‌ను ఉద్యోగ సంఘాలు సోమవారం ఘనంగా సన్మానించాయి. అమరావతి జేఏసీ ఛైర్మన్ వి.ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆయనకు బొకేలు అందజేశారు. కలెక్టర్ కృషికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సాయిబాబు, గణేశ్ పాల్గొన్నారు.
News March 16, 2026
మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్ ఖాన్‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.


