News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 12, 2026

భద్రాచలం. ‘శ్రీరామనవమి వేడుకలు.. బస్సులు కొరత ఉండొద్దు’

image

భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్‌లో శ్రీరామనవమి వేడుకలపై TSRTC సమీక్ష సమావేశం జరిగింది. కరీంనగర్ డిపో మేనేజర్ సాల్మన్ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల 27, 28న స్వామివారి కళ్యాణానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో భద్రాచలం డిపోతో పాటు ఆరు డిపోల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

News March 12, 2026

ముత్యాలమ్మ జాతరలో డ్రోన్లతో నిఘా

image

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగించారు. జాతరలో అసాంఘిక కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటివి జరగకుండా అరికట్టారు.

News March 12, 2026

శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

image

జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 4 బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.