News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 12, 2026
ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.
News March 12, 2026
MNCL: క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మై భారత్ ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్నింగ్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
News March 12, 2026
సిరిసిల్ల: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన అంబులెన్స్

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు కామారెడ్డి వెళ్లేందుకు బస్టాండ్‌లోకి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన 102 అంబులెన్స్ అదుపుతప్పి బస్సును ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


