News September 11, 2025

ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!

image

ఖమ్మం టేకులపల్లి ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. HYD అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. D/B పార్మసీ, ఎస్ఎస్సీ ఆపైన విద్యార్హత కలిగి, 18 నుంచి 35 సం.రాలు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు విద్యార్హత పత్రాలతో జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

ఖమ్మం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయింపు

image

ఖమ్మం జిల్లా రేషన్ లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి శుభవార్త తెలిపారు. రేపటి నుంచి 22 వరకు జిల్లాలోని చౌక ధరల దుకాణాల్లో బియ్యం లభిస్తాయని ప్రకటించారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించి, షాపులకు సరఫరా చేశామని తెలిపారు. లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల రేషన్ షాపుల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని కోరారు.

News December 17, 2025

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో శిక్షణ

image

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్‌వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రాంగణంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.

News December 17, 2025

ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

image

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.